సమయపాలనతో మంచినీరు అందించాలి.

వెల్టూర్ కాంగ్రెస్ నాయకుడు మద్దూర్ వెంకటయ్య.

సమయపాలనతో మంచినీరు అందించాలి.

పెద్దమందడి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు తాగునీటిని అందించాలని కాంగ్రెస్ నాయకుడు మద్దూర్ వెంకటయ్య కోరారు. గ్రామస్థుల వృత్తి, వ్యాపార, ఉద్యోగ సమయాలను దృష్టిలో ఉంచుకుని వారికి అందుబాటులో ఉండే వేళల్లో సరఫరా చేపట్టాలని సూచించారు.ప్రజలు ఇళ్లలో లేని సమయంలో నీటిని విడుదల చేయడం వల్ల వృథా జరుగుతోందని, అవసరమైన సమయంలో అందకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించేందుకు స్థానికుల అవసరాలను తెలుసుకుని సరఫరా సమయాలను నిర్ణయించాల్సిన బాధ్యత పంచాయతీ సిబ్బందిపై ఉందన్నారు.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును విలువైనదిగా భావించి వృథాను అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలు కూడా అవసరానికి మించి నీటిని వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ సరైన సమయంలో సరఫరా చేస్తే వృథాను నియంత్రించడంతో పాటు గ్రామంలోని కుటుంబాల అవసరాలను సమర్థవంతంగా తీర్చవచ్చని మద్దూర్ వెంకటయ్య అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News