మృతుడి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం.
Views: 0
On
పెద్దమందడి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన గొల్లపాలెం రాములు అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం రాములు పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.4,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.రాములు మృతి పట్ల గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్‌తో పాటు గర్రెమోని బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, పెద్ది రాఘవేంద్ర, మల్లికార్జున్, ఎం. రాములు, బోడి గణేశ్, శివకృష్ణ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Sep 2026 21:43:54
కాజీపేట్ సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట జంక్షన్ పరిధి లోని రైల్వే డీజిల్ లోకో షెడ్ లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత...


Comments