ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.

జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రెటరీ జనరల్‌ ఎక్కటీ సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు వారికి 20 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేక త్యాగాలు, పోరాటాలతో సాగిందని సంజీవరెడ్డి పేర్కొన్నారు. వేలాది మంది ఉద్యమకారులు నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొని రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను ఉద్యమానికి అంకితం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడి అవయవాలు కోల్పోయారని, పలువురు కేసులు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించారని గుర్తుచేశారు.
రాష్ట్ర సాధన అనంతరం కూడా ఉద్యమకారుల త్యాగాలను విస్మరించకుండా వారికి గౌరవం, గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారుల కుటుంబాలతో పాటు అవయవాలు కోల్పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు, జైలు పాలైన ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను అధికారికంగా నమోదు చేయాలని కోరారు.
ఉద్యమకారులకు గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలతో పాటు రాజకీయ పార్టీల సంస్థాగత నిర్మాణంలోనూ వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు. పార్టీ పదవులు, కమిటీలు, స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉద్యమకారుల పాత్రను గుర్తించాలని కోరారు.
ఉద్యమకారులను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకోకుండా పార్టీ నిర్ణయ ప్రక్రియలోనూ వారికి ప్రాధాన్యం కల్పించాలని సంజీవరెడ్డి అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల సమస్యలపై చర్చించి, వారికి 20 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంపై తమ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా అవకాశాలు కల్పించడం వారి త్యాగాలకు ఇచ్చే గౌరవంగా భావించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించడంతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యతగా భావించాలని ఎక్కటీ సంజీవరెడ్డి కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.