చాకలి ఐలమ్మకు ఘన నివాళి.
*బహుజనుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*
*ఆమె ధైర్యసాహసాలు తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిదాయకం: మేయర్*
కరీంనగర్, సెప్టెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఘనంగా నిర్వహించారు. శనివారం జరిగిన అధికారిక కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై చింతకుంటతో పాటు ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తా వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహాలకు రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వం, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చిట్యాల ఐలమ్మ అని అన్నారు. కౌలు భూమి కోసం దొరల గూండాలను ఎదిరించి ఆమె చూపిన తెగువ, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బహుజన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, పాలకవర్గ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి
ని మల్లేశం, రజక సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


Comments