స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.!
లబ్ధిదారులకు కార్డులు అందజేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, సెప్టెంబరు 26 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలంలోని పాకలగూడెం, నారాయణపురం గ్రామాల్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంతో పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలతో గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, ఎంఆర్‌ఓ, ఎంపీడీవో, పాకలగూడెం సర్పంచ్ గుంటుపల్లి సునీత కృష్ణ, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణపురం సర్పంచ్ తెల్లూరి వెంకట్ విజయ్‌లక్ష్మి, ఉపసర్పంచ్ తిరుమలరావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Comments