శ్రీపతిపల్లిలో పేద రైతు పట్టా భూమి ఆక్రమణకు యత్నం.
న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు బాధితుడి వినతి.
చిల్పూర్, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో పేద యాదవ రైతు పట్టా భూమి ఆక్రమణకు గురవుతోందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన నరాల కనుకయ్య తనకు సర్వే నంబర్ 315/ఏలో 35 గుంటల పట్టా భూమి ఉందని, తరతరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు.
అయితే అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుల సంఘం పేరుతో పట్టా భూమిలోని రెండు గుంటల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని కనుకయ్య ఆరోపించారు. ఈ నెల 8న తన పొలంలో ఉన్న గడ్డి కట్టలను బావిలో పడేయడంతో పాటు నీటి పైపులు, షెడ్డును ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా పొలానికి వెళ్లే దారిని అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.తన భూమికి అధికారుల ద్వారా హద్దులు నిర్ణయించి, ఆక్రమణకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. పొలానికి వెళ్లే దారిని పునరుద్ధరించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి విజ్ఞప్తి చేశారు.


Comments