దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యార్థులు.

సమాజ సేవలో ఆదర్శంగా నిలిచిన పాఠశాల విద్యార్థులు.

దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యార్థులు.

వనపర్తి,సెప్టెంబర్‌26(తెలంగాణ ముచ్చట్లు):

దివ్యాంగుల కోసం విరాళాలు సేకరించి వారికి అండగా నిలిచిన వనపర్తి జిల్లా కేంద్రంలోని రేడియంట్‌ ఉన్నత పాఠశాల, తిరుమల హిల్స్‌ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌ గౌడ్‌, పరవస్తు సొసైటీ రాష్ట్ర సమన్వయకర్త గద్దె భాస్కర్‌ అన్నారు.శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తమ జేబు ఖర్చులతో పాటు ఇంటింటికీ తిరిగి విరాళాలు సేకరించి దివ్యాంగులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మొత్తం రూ.16 వేల విరాళాలను సేకరించారని తెలిపారు.సమాజ సేవకు ముందుకొచ్చిన విద్యార్థులందరినీ వారు మనస్ఫూర్తిగా అభినందించారు. విద్యార్థులు పుస్తక పాఠాలకే పరిమితం కాకుండా మానవత్వం, సేవా భావాన్ని అలవరచుకోవడం ఆదర్శనీయమన్నారు. ఇతరులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.అనంతరం విరాళాలు అందించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పతకాలను అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ కౌసల్య భాస్కర్‌, ప్రధానోపాధ్యాయుడు ఉప్పరి తిరుమలేష్‌, ఉప ప్రధానోపాధ్యాయుడు బి. రాము, పర్యావరణ పరిరక్షణ విభాగం సమన్వయకర్త శృతి, ఉపాధ్యాయులు రాహుల్‌, శాంతయ్య, శ్రీనివాస్‌, అఖిల్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేష్‌, మల్లేష్‌, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా, తల్లిదండ్రులు, విద్యార్థులు, సాహితీ కళా వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. 28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 28న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దమందడి కాంగ్రెస్...
చాకలి ఐలమ్మకు ఘన నివాళి.
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక.
250 వారాలుగా నిరంతర అన్నదానం.. మతీన్‌ & ఫ్రెండ్స్‌ ట్రస్ట్ సేవాభావం.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.
స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
శ్రీపతిపల్లిలో పేద రైతు పట్టా భూమి ఆక్రమణకు యత్నం.