సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.

8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్.

సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు): 

మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను 8వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పొన్న రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పొన్న రవీందర్, పొన్న రాజయ్య, పొన్న యాకయ్య, మచ్చ వెంకటయ్య, లొంక రమేష్, స్థానికులు వడ్లకొండ రాంబాబు, గాండ్ల ధనుజయ, సయ్యద్ సాజిద్, రంగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. 28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 28న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దమందడి కాంగ్రెస్...
చాకలి ఐలమ్మకు ఘన నివాళి.
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక.
250 వారాలుగా నిరంతర అన్నదానం.. మతీన్‌ & ఫ్రెండ్స్‌ ట్రస్ట్ సేవాభావం.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.
స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
శ్రీపతిపల్లిలో పేద రైతు పట్టా భూమి ఆక్రమణకు యత్నం.