28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.

కొమ్ము వెంకటస్వామి పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.

వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 28న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనలో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూర్‌లో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 9.30 గంటలకు వెల్టూర్‌కు చేరుకోనున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.అనంతరం వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో బాలుర జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు కొమ్ము వెంకటస్వామి తెలిపారు. నూతన పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల నిర్మాణంతో ఆయా ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని కొమ్ము వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. 28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 28న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దమందడి కాంగ్రెస్...
చాకలి ఐలమ్మకు ఘన నివాళి.
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక.
250 వారాలుగా నిరంతర అన్నదానం.. మతీన్‌ & ఫ్రెండ్స్‌ ట్రస్ట్ సేవాభావం.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.
స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
శ్రీపతిపల్లిలో పేద రైతు పట్టా భూమి ఆక్రమణకు యత్నం.