స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

రజక సంఘం, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు.

స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు శనివారం స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రవి మాట్లాడుతూ దొరల అహంకారాన్ని ఎదిరించి పేదల భూముల కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పొన్న రాజేష్, పొన్న బిక్షపతి, సత్యనారాయణ, మధు, మచ్చ బిక్షపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా..

స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కార్యాలయంలో కూడా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి మేనేజర్ సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ నీల రాజమ్మ, లెక్కల అధికారి నితిన్, పట్టణ ప్రణాళిక అధికారి సాయి, జూనియర్ సహాయకులు సందీప్, శ్రీనివాస్, సుమలత, మంజుల, కౌన్సిలర్లు పొన్న రవి, పొన్న రాజేష్, పొన్నం స్వరూప–రాజయ్య, అంగడి రజిత–కృష్ణ, సహనామినేటెడ్ సభ్యుడు గన్ను నరసింహులు, తిరుమలనాథ దేవస్థాన చైర్మన్ నీల నరసింహులు, గట్టు రమేష్, పెసరు సారయ్య, గుర్రం రమేష్, షేక్ జానీ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. 28న వనపర్తి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల 28న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దమందడి కాంగ్రెస్...
చాకలి ఐలమ్మకు ఘన నివాళి.
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక.
250 వారాలుగా నిరంతర అన్నదానం.. మతీన్‌ & ఫ్రెండ్స్‌ ట్రస్ట్ సేవాభావం.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.
స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.
శ్రీపతిపల్లిలో పేద రైతు పట్టా భూమి ఆక్రమణకు యత్నం.