బాపూజీ ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి.
మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన కీలక పాత్రను, ప్రజాసేవకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, సీనియర్ సహాయకులు లింగయ్య, సీనియర్ లెక్కల అధికారి నితిన్, జూనియర్ సహాయకులు సందీప్, శ్రీనివాస్, సుమలత, మంజుల, మధు, జూనియర్ లెక్కల అధికారి లత, పట్టణ ప్రణాళిక అధికారి సాయి, సహాయ ఇంజినీర్ అనిల్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్ తాటికొండ మధు తదితరులు పాల్గొన్నారు.


Comments