స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.

స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

పట్టణంలోని శివాజీ సెంటర్ సమీపంలో ఉన్న అల్ఫా మొబైల్స్ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణ యజమాని కుసుమ సాంబశివరావు శనివారం రాత్రి 9.30 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం వెనుక తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.
దుకాణంలో నుంచి ఒక ఐటెల్ మొబైల్, రెండు ప్రొజెక్టర్లు, ఒక డ్రోన్, 30 బ్లూటూత్ పరికరాలు, 60 స్పీకర్లు, కేబుల్స్, ఛార్జర్లు, మూడు సోలార్ లైట్లు, 30 ఇయర్ ఫోన్లు సహా సుమారు రూ.50 వేల విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల మధ్య చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. దుకాణం పరిసరాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.IMG-20260927-WA0044

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.