అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.

అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.

ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్- 27(తెలంగాణ ముచ్చట్లు )

స్థానిక లకారం ట్యాంక్ బండ్ ప్రాంగణంలో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన యువ స్కూల్, యువ కాలేజ్ పోటీల్లో గెలుపొందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా అటవీ అధికారి బహుమతుల ప్రదానం చేశారు.  

ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ, జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు అయినా వెలుగుమట్ల అర్బన్ పార్క్, పులిగుండాల ఎకో టూరిజం, లకారం ట్యాంక్ బండ్, ఖమ్మం ఖిల్లా, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, వైరా, పాలేరు లాంటి రిజర్వాయర్లు పర్యాటకులకు ఆహ్లాదం ఇచ్చే విధంగా ఉన్నాయని తెలిపారు.

వేడుకల్లో కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.  వేడుకల్లో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే సంగీత విభావరి, న్యూ విజన్ హైస్కూల్ విద్యార్థిని భాగ్య సాన్వి బృందంచే శాస్త్రీయ స్వాగత నృత్యం, జాతీయ నృత్యకారిణి లక్షణ్యచే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, టీజీఎస్ డబ్ల్యూడీసీ చెందిన శ్రీకళ అండ్ టీమ్ (10 మంది)చే జానపద మేళవింపు ( టీజీ డబ్ల్యూఆర్ఎస్ కుసుమంచికి చెందిన చిన్మయి బృందంచే సెమీ క్లాసికల్ డ్యాన్స్,  దుర్గచే శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. 

ఈ వేడుకల్లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు,  జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.IMG-20260927-WA0058

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.