గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది

గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది

ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు

ఏటూరునాగారం, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు సూచించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఓడగూడం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గోదావరి నీటిమట్టం 14.18 మీటర్లకు చేరుకుందని, త్వరలోనే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 14.83 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని శ్రీలత లక్ష్మణ్ బాబు సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప నది వైపు వెళ్లవద్దని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా పిల్లలు, పశువులను నది పరిసరాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని అధికారులను కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలు అధికారులకు సమాచారం అందించి సహకరించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో తుమ్మ మల్లారెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, కర్ర రవీందర్, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, కొండాయి చిన్ని, కార్యదర్శి జనార్ధన్, ఖాతా యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.