కరాటే పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల సత్తా.

గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన చిన్నారులకు అభినందనలు.

కరాటే పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల సత్తా.

హుజురాబాద్,సెప్టెంబర్ 27(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్‌కు చెందిన విద్యార్థులు కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి పలు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు. వివిధ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి హుజురాబాద్‌కు పేరు తీసుకువచ్చారు.
ఈ పోటీల్లో ఎస్కే. సదుల్లా బాబా స్పారింగ్‌లో గోల్డ్ మెడల్, భాను తేజ కటాస్‌లో గోల్డ్ మెడల్, సాయి చరణ్ స్పారింగ్‌లో గోల్డ్ మెడల్, కటాస్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే హుమేరా తస్లీమ్, వినూత్న, సాక్షిత్, హేమ, సాయి, ఎస్.కె. గౌసియాలు కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థుల విజయంపై తెలంగాణ రిటైర్డ్ ఆల్ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్, రిటైర్డ్ పీడీ కొన్ని రాజిరెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ బి. రాజ్ కుమార్, ప్రిన్సిపల్ వెంగళరావు, డైరెక్టర్ వి. గోపాల్, కరాటే మాస్టర్ తదితరులు విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు క్రమశిక్షణతో సాధన చేస్తూ కరాటేలో ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించి హుజురాబాద్‌కు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.