వరదలో నీటమునిగిన మిర్చి పంట.

వరదలో నీటమునిగిన మిర్చి పంట.

అప్పులు చేసి సాగు చేసిన పంట కళ్ల ముందే నీటిపాలు

నష్టంతో కన్నీరుమున్నీరవుతున్న రైతు కుటుంబం

వాజేడు, సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

భారీ వర్షాలు, గోదావరి వరదలతో మిర్చి రైతు తీవ్రంగా నష్టపోయాడు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన రైతు గొర్లపల్లి సుమన్ సాగు చేసిన మిర్చి పంట పూర్తిగా నీటమునిగింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గోదావరి వరద నీరు పంట పొలాల్లోకి చేరడంతో మిర్చి మొక్కలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.అప్పులు చేసి ఎంతో కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే నీటిపాలు కావడంతో రైతు సుమన్ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో భారీగా నష్టం వాటిల్లిందని రైతు కన్నీరుమున్నీరయ్యాడు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుటుంబం ఆందోళన చెందుతోందని వాపోయాడు.

పరిహారం అందించాలని వేడుకోలు

నీటమునిగిన మిర్చి పంటను అధికారులు వెంటనే పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతు కుటుంబం కోరుతోంది. పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి, ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.