ప్రజావాణికి 14 దరఖాస్తులు.

ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: అధికారులు.

ప్రజావాణికి 14 దరఖాస్తులు.

సైదాపూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి మొత్తం 14 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. వీటిలో తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి 5 దరఖాస్తులు, ఎంపీడీవో కార్యాలయానికి 4, హౌసింగ్ శాఖకు 2, మెడికల్ ఆఫీసర్‌కు 1, వ్యవసాయ శాఖకు 1, విద్యుత్ శాఖకు 1 దరఖాస్తు వచ్చినట్లు వివరించారు.

ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజలకు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కలుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు పాల్గొన్నట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.