ప్రహరి గోడను కూల్చుతామని బెదిరింపులు.

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు.

ప్రహరి గోడను కూల్చుతామని బెదిరింపులు.

మహబూబ్‌నగర్,సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎరుకల సుబ్రహ్మణ్యం తన ఇందిరమ్మ ఇంటి ప్రహరి గోడను కూల్చుతామని కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ భర్త నీలయ్య, రేషన్ డీలర్ అశోక్‌తో పాటు మరో ఐదుగురు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.తమ ఇంటి ముందు ఉన్న పాత విద్యుత్‌ స్తంభాన్ని తొలగించాలని పలుమార్లు గ్రామపంచాయతీకి విన్నవించినా స్పందించలేదన్నారు. ఇటీవల తమ కుమార్తె వివాహం సందర్భంగా బయటకు వెళ్లిన సమయంలో తాము పెంచిన చెట్టును నరికివేశారని, ప్రశ్నించగా కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ విషయంపై జూలై 12న అడ్డాకుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం మళ్లీ ప్రహరి గోడను కూల్చుతామని బెదిరిస్తున్నారని, తనకు కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఫిర్యాదుపై డీఎస్పీతో విచారణ చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎరుకల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఏలసరి పెద్ద బాలయ్య, జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్, ఉపాధ్యక్షులు ఏలసరి బాలరాజ్, నల్లగొండ్ల శాంతయ్య, ఏలసరి తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.