వెల్టూర్‌ను మండల కేంద్రంగా చేస్తాం.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .

వెల్టూర్‌ను మండల కేంద్రంగా చేస్తాం.

పెద్దమందడి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వెల్టూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి విచ్చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుందని తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి తనను ఎప్పుడు కలిసినా వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పదేపదే కోరుతున్నారని మంత్రి గుర్తు చేశారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి వెల్టూర్ మండల కేంద్రం అంశాన్ని తన దృష్టికి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో కొత్తగా మండలాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా అవకాశం వచ్చినప్పుడు వెల్టూర్‌ను మండల కేంద్రంగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.వెల్టూర్ మండల కేంద్రంగా ఏర్పడితే పరిసర గ్రామాల ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ అవుతాయని, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.