ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ.

లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన ఎంపీడీవో పరిణత.

ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ.

పెద్దమందడి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామంలో పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను ఎంపీడీవో పరిణత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పరిణత మాట్లాడుతూ.. పూరి గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించుకునే అవకాశం కలుగుతుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే సహాయంతో నాణ్యమైన ఇళ్లను నిర్మించుకుని, తమ కుటుంబాలకు సురక్షితమైన నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరారు.పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న తమకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.