ఓట్ల చోరీపై కేంద్రం సమాధానం చెప్పాలి.

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి : వెలిచాల రాజేందర్‌రావు.

ఓట్ల చోరీపై కేంద్రం సమాధానం చెప్పాలి.

కరీంనగర్, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):

 ఓట్ల చోరీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ పిలుపు, టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లోని ఇందిరాచౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. ఓట్ల చోరీ వ్యవహారంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం సీఈసీని ముందు పెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణలోనూ ఇలాంటి చర్యలకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ నిరసనలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న, అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.