సునీల్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా.
*క్యాంప్ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం*
*భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు*
కరీంనగర్, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. భగత్‌నగర్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యాంప్ కార్యాలయం కిటకిటలాడింది.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు సునీల్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి, మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం పూలమాలలు, శాలువాలతో సునీల్‌రావును ఘనంగా సత్కరించారు.
తన జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ సునీల్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల ప్రోత్సాహం, ప్రజల ఆశీస్సులే తనకు కొండంత బలమని, ప్రజాసేవే పరమావధిగా నగర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నగర నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మోర్చాల అధ్యక్షులు, కాలనీ పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments