2047 భారతంపై విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.

2047 భారతంపై విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితం, పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన, కార్యక్రమ కన్వీనర్ పల్లెపాటి మధుకర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులకు నరేంద్ర మోదీ ప్రజా సేవా ప్రస్థానం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. అనంతరం ‘వికసిత్ భారత్–2047’ అంశంపై విద్యార్థులు ఉపన్యాసాలు, చిత్రలేఖనం ద్వారా తమ ఆలోచనలు, సృజనాత్మకతను ప్రదర్శించారు.
2047 నాటికి భారతదేశం ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర–సాంకేతిక రంగాలు, ఆధునిక వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, మెరుగైన విద్య–వైద్యం వంటి రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని విద్యార్థులు ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, ఆత్మనిర్భరత వంటి అంశాలపై కూడా తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారతదేశానికి నాయకత్వం వహించనున్నారని అన్నారు. విద్యార్థుల ఆలోచనలు, కలలు, సృజనాత్మకత వికసిత్ భారత్–2047 నిర్మాణానికి ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి తన రంగంలో నైపుణ్యాన్ని సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు.
ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు సేవా సంకల్ప్ అభియాన్ ప్రశంసా పత్రాలను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తూ పెన్సిల్ స్కెచ్‌లను అందించారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చీదురాల వెంకటేష్, అల్లి కుమార్, జనగాని కిష్టయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం మధుకర్ రెడ్డి, వెళదండి రాజేందర్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు గూడెం నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ పోలు శివసేన తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు నర్సింహులు, సుధాకర్, శ్రీధర్ రెడ్డితో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.