ఘనపూర్‌లో అద్భుతం.. బొప్పాయి కాయలో వినాయకుడి రూపం.

ఘనపూర్‌లో అద్భుతం.. బొప్పాయి కాయలో వినాయకుడి రూపం.

గణపయ్య మహిమేనంటూ భక్తుల ఉత్సాహం.. 

చూసేందుకు బారులు తీరిన స్థానికులు

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో బొప్పాయి కాయ వినాయకుడి రూపంలో దర్శనమివ్వడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రతాపగిరి సుగుణ–రవి దంపతులు పాలకుర్తి రోడ్డులోని తమ ఖాళీ స్థలంలో బొప్పాయి తోట సాగు చేస్తున్నారు. ఈ తోటలోని ఓ చెట్టుకు తొండం, చెవులు, బొజ్జ ఆకారంతో వినాయకుడి రూపాన్ని పోలిన బొప్పాయి కాయ కనిపించింది.

శ్రీ లక్ష్మీ గణపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 ఏళ్లుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రతాపగిరి సుగుణ–రవి దంపతులు నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం గణపతి ప్రసాదాన్ని తోటలో చల్లేందుకు వెళ్లారు. ఈ సమయంలో చెట్టుకు వేలాడుతున్న బొప్పాయి కాయ వినాయకుడి రూపంలో కనిపించడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని గణపయ్య మహిమగా భావించి ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ వింతను చూసేందుకు శ్రీ లక్ష్మీ గణపతి అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గతేడాది కూడా నవరాత్రుల సమయంలో ఇదే తోటలో వినాయకుడి రూపాన్ని పోలిన బొప్పాయి కాయ కాసిందని ప్రతాపగిరి సుగుణ తెలిపారు. దానిని గణేష్ మండపంలో ఉంచి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేసినట్లు వివరించారు.

ప్రస్తుతం కనిపించిన బొప్పాయి కాయకు కూడా తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తొండం, చెవులు, బొజ్జతో వినాయకుడి రూపాన్ని పోలి ఉన్న ఈ బొప్పాయి కాయకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రత్యేక పూజల్లో IMG-20260928-WA0082కమిటీ సభ్యులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.