కుల రహిత సమాజమే లక్ష్యంగా భవిష్యత్ పోరాటం.

ఎం.ఈ.ఎఫ్. జాతీయ కోర్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా గద్వాల కృష్ణ నియామకం

కుల రహిత సమాజమే లక్ష్యంగా భవిష్యత్ పోరాటం.

వనపర్తి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భవిష్యత్‌లో పోరాటాలు కొనసాగిస్తామని ఎం.ఈ.ఎఫ్. నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎం.ఈ.ఎఫ్. జాతీయ సమావేశంలో గద్వాల కృష్ణను జాతీయ కోర్ కమిటీ వైస్‌ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గద్వాల కృష్ణను శాలువా, జ్ఞాపికతో సన్మానించి నియామక ఉత్తర్వులు అందజేశారు. అనంతరం గద్వాల కృష్ణ మాట్లాడుతూ మాదిగల సమగ్ర అభివృద్ధి, పీడిత వర్గాల విముక్తి లక్ష్యంగా మందకృష్ణ మాదిగ చూపిన బాటలో ముందుకు సాగుతామని తెలిపారు. సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎం.ఈ.ఎఫ్. జాతీయ కోర్ కమిటీ అధ్యక్షులు బొంత యేసుదాస్, జాతీయ అధ్యక్షులు బిక్షాలు, డాక్టర్ ఎం. కృష్ణయ్య, మందా దేవేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.