వెల్టూర్‌ను మండల కేంద్రంగా ప్రకటిస్తామని మంత్రి హామీ.. బీజేపీ రమేష్ హర్షం.
Views: 2
On
పెద్దమందడి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడంపై బీజేపీ నాయకుడు రమేష్ హర్షం వ్యక్తం చేశారు. వెల్టూర్‌ను మండల కేంద్రంగా చేయాలని గతంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే.వెల్టూర్ గ్రామానికి మంత్రి వచ్చిన సందర్భంగా మండల కేంద్రం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, రాష్ట్రంలో కొత్తగా మండల కేంద్రాల ఏర్పాటు సమయంలో మొదట వెల్టూర్‌ను మండల కేంద్రంగా ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రమేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అలాగే సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 Sep 2026 21:41:07
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...


Comments