చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి.
పలుస శంకర్ గౌడ్, జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బ్లాక్ బెల్ట్ సాధించిన రేడియంట్ హైస్కూల్, తిరుమలహిల్స్ విద్యార్థులు మేకల లోహిత్ యాదవ్, ఉప్పరి వివేక్ సాగర్, మేకల లిక్కిత్ యాదవ్‌లను పాఠశాల యాజమాన్యంతో కలిసి ఆయన ఘనంగా అభినందించారు.జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన పీ.టీ. మాస్టర్ కె. వెంకటేష్‌ను కూడా ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. వనపర్తి ప్రాంతానికి జాతీయస్థాయిలో పేరు తీసుకురావడం గర్వకారణమని కొనియాడారు.పాఠశాల కరస్పాండెంట్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపల్ ఉప్పరి తిరుమలేష్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమ రాము, శ్రీనివాస్, శాంతయ్య, రాహుల్, అఖిల్, మల్లేష్, ఖాదిరునిసా, రామేశ్వరి, అఖిల, సరోజ, రజిత, అంజలి తదితరులు పాల్గొన్నారు.


Comments