నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
అరెస్టులను ఖండిస్తున్నాం.
Views: 1
On
చిల్పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేదల ఇళ్ల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ విమర్శించారు. జనగామ కలెక్టరేట్ ఎదుట ఇళ్ల కేటాయింపు కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు, బాధితులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కేటాయించిన 72 పేద కుటుంబాలకు వెంటనే అప్పగించాలని, నిరుపేదల నివాసాలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోట్ల శేఖర్, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ తదితరులను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 Sep 2026 21:41:07
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...


Comments