పెనుగోలు కాలనీ సమస్యలపై ఆదివాసీ నవనిర్మాణ సేన ఆగ్రహం.

పెనుగోలు కాలనీ సమస్యలపై ఆదివాసీ నవనిర్మాణ సేన ఆగ్రహం.

ఇంటి పన్నులు, పట్టాలు, విద్యుత్‌ మీటర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపాటు

వాజేడు,సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు): 

పెనుగోలు కాలనీ గ్రామస్థులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇంటి పన్నులు, ఇంటి పట్టాలు, విద్యుత్‌ మీటర్ల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల అధ్యక్షుడు మోడెం నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వాజేడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.పెనుగోలు కాలనీ సమస్యలపై పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని నాగరాజు ఆరోపించారు. గ్రామంలో ఇంటి పన్నులు, ఇంటి పట్టాల విషయంలో నెలకొన్న వ్యత్యాసాలను పరిష్కరించడంతో పాటు కొత్త విద్యుత్‌ మీటర్ల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని తొలగించాలని కోరారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం పెనుగోలు కాలనీ వాసుల విషయంలో కేవలం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు వెంటనే పెనుగోలు కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించాలని కోరారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు, విద్యుత్‌ మీటర్లు మంజూరు చేసి, ఇంటి పన్నులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో బాధితులతో కలిసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని నాగరాజు హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎస్ రాష్ట్ర సామాజిక మాధ్యమాల అధికార ప్రతినిధి పాయం అజయ్, మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.