మంత్రులకు ఘన స్వాగతం పలికిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.

మంత్రులకు ఘన స్వాగతం పలికిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

పెద్దమందడి,సెప్టెంబర్28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే మేఘా రెడ్డికి వెల్టూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వడ్డె శేఖర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దిండు రవీందర్, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, బాబు రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వడ్డె శేఖర్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. నూతన పాఠశాల భవనం అందుబాటులోకి వస్తే వెల్టూర్‌తో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు లభిస్తాయని తెలిపారు.విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం సంతోషకరమన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణం త్వరగా పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారని వడ్డె శేఖర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ. మతిస్థిమితం లేని బాలుడిని  అన్నం సేవా ఫౌండేషన్‌ అప్పగించిన ఎస్ ఐ.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ) నాగులవంచ గ్రామంలో కొన్ని రోజులుగా రోడ్డు పై మతిస్థిమితం లేని బాలుడు తిరుగుతున్న విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకున్న...
టిఫిన్ కోసం వెళ్లిన తండ్రి.. కారులో చిన్నారి లాక్.
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
నిరుపేదల ఇళ్ల సమస్య పరిష్కరించాలి.
మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలి.
చాగల్లు నుంచి కొండగట్టుకు హనుమాన్ మాల స్వాములు.