నిబద్దతతో నియోజకవర్గ అభివృద్ధి చేయాలనే తపనతో పని చేస్తున్నాను:మాజీ ఉపముఖ్యమంత్రి కడియం .
జఫర్గడ్,సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు)
మండలం షాపల్లి, సూరారం గ్రామాలలో సోమవారం పలు అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా షాపల్లి గ్రామంలో 17.50లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, 10లక్షలతో నిర్మించిన వివో భవనాన్ని ప్రారంభించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సూరారం గ్రామంలో 15లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించి ,10లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 2.50లక్షలతో మరమ్మత్తులు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించి, గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.... గత 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధిని, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని పైగా చిల్లర పనులతో నియోజకవర్గానికి చెడ్డ పేరు తీసుకువచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా 20ఏళ్ల క్రితమే మండలంలోని ప్రతీ గ్రామానికి బిటీ రోడ్లు వేసింది కడియం శ్రీహరే అని ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు వాటికీ మారమ్మత్తులు కూడా చేయలేదని అన్నారు. అలాగే 2023లో మళ్ళీ నేను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత 3ఏళ్లలోనే 1600కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై ఉన్న ప్రేమతో, నాపై ఉన్న అభిమానంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. నిజాయితీగా నిబద్దతతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాని ఏనాడూ ఎవరి దగ్గర రూపాయి అవినీతికి పాల్పడలేదని కడియం వెల్లడించారు. అదే విధంగా ఎన్నికలు ఏవైనా ప్రజల గురించి ఆలోచించే వారిని, నిజాయితీగా ఉంటూ కష్టపడి పని చేసే వారినే ఎన్నుకోవాలని సూచించారు. అతి త్వరలోనే సూరారం క్రాస్ నుండి షాపల్లి వరకు మరియు షాపల్లి నుండి తమ్మడపల్లి జి మీదుగా ఓబులాపురం వరకు రోడ్డు మంజూరు చేయిస్తానని తెలిపారు. అంతేకాకుండా మరొకసారి షాపల్లి గ్రామానికి 15రోజులలో 10లక్షల సిసి రోడ్లు, 10ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 1994లో నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సూరారం గ్రామానికి సరైన రోడ్డు కూడా లేదని ఈ రోజు సూరారం గ్రామానికి నాలుగు వైపులా బిటీ రోడ్లు ఉన్నాయి అంటే అది కడియం శ్రీహరి వల్లనే అన్నారు. ఆనాడే సూరారం గ్రామ ప్రజల కరెంట్ కష్టాలు తీర్చాలని 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం చేయించానని తెలిపారు. సూరారం గ్రామానికి 20లక్షల సిసి రోడ్లు, 20ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాల ప్రహరీ గోడ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన కాలువ నుండి 2L కెనాల్ ద్వారా సూరారం చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చే బాధ్యత నాదని స్పష్టం చేశారు. జఫర్ గడ్ నుండి హిమ్మత్ నగర్ మీదుగా సూరారం వరకు 5కోట్లతో రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్ల వెల్లడించారు. 6నెలలలో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని కడియం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, షాపల్లి సూరారంల సర్పంచ్లు సు
భాష్, ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, అధికారులు ,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments