కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన.
జనగామలో దద్దరిల్లిన ర్యాలీ..
భారీగా తరలివెళ్లిన చిల్పూర్ కాంగ్రెస్ శ్రేణులు
చిల్పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చిన్నపెండ్యాల నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి జనగామలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అధ్యక్షతన మండల కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, ముఖ్య నాయకులు గడ్డమీద సురేష్, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.


Comments