కరీంనగర్ కిడ్స్ కేర్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

కరీంనగర్ కిడ్స్ కేర్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

*సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల సందడి*

*ఆటపాటలతో అలరించిన వేడుకలు*

కరీంనగర్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు): 

కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉన్న కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ముద్దుగా ముస్తాబై వచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’, ‘బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు.

అనంతరం బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించి, చిన్నారులకు స్వీట్లు, ప్రసాదం పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ అండ్ కరస్పాండెంట్ శ్రీ జక్కుల గిరిబాబు చిన్నారులను అభినందించి, ఆశీర్వదించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. చిన్నతనం నుంచే మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.