రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి!

రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి!

ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు

మల్కాపూర్ ఉపకేంద్రంలో విచారణ.. 

రైతులకు న్యాయం చేస్తామని హామీ

చిల్పూర్, అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి గడ్డం సిద్దయ్య రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని రైతులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీడీలు, గృహజ్యోతి పథకం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్‌ మార్పిడి కేంద్రంలోని నూనె మార్పిడి తదితర పనుల పేరుతో రైతులను బెదిరిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు.రైతుల ఫిర్యాదుపై స్పందించిన విజిలెన్స్ సహాయ సంచాలకుడు శుక్రవారం మల్కాపూర్ విద్యుత్ ఉపకేంద్రంలో విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగితో పాటు బాధిత రైతులను పిలిపించి వివరాలు సేకరించారు.
వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని, బాధిత రైతులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం. పల్లగుట్టలో ఐకేపీ కేంద్రం ప్రారంభం.
చిల్పూర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక...
పల్లెపల్లెనా పూల జాతర!
ఘనపూర్‌లో ఆరు అడుగుల భారీ బతుకమ్మ!
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు.
శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.
.తాటికాయలలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు.
పీచరలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.