తల్లి, బిడ్డల సంక్షేమమే అంగన్వాడీల లక్ష్యం.

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి.

తల్లి, బిడ్డల సంక్షేమమే అంగన్వాడీల లక్ష్యం.

భీమదేవరపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

తల్లి, బిడ్డల సంక్షేమం కోసం అంగన్వాడీలు విశేష సేవలు అందిస్తున్నాయని ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి అన్నారు. బుధవారం ముల్కనూర్ అంగన్వాడీ-1 కేంద్రంలో పోషణ వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. చిన్నారుల ఆరోగ్యమే మహాభాగ్యమనే భావనతో తల్లిదండ్రులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. శిశువుల రోగనిరోధక శక్తి పెంపునకు తల్లిపాలు ఎంతో ముఖ్యమన్నారు.

సీడీపీఓ స్వరూపరాణి మాట్లాడుతూ ఆకుకూరలు, కూరగాయలను ఉప్పునీటితో శుభ్రంగా కడిగి వండుకోవాలని సూచించారు. ఏడు నెలలు పైబడిన చిన్నారులకు తేలికపాటి అనుబంధ ఆహారం అందించాలని తెలిపారు. మూడేళ్లలోపు పిల్లలకు అందించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

అనంతరం పోషకాహార పదార్థాల ప్రదర్శన నిర్వహించారు. గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ పారిజాతం, ఏఎన్‌ఎంలు కళ, వనజ, స్వరూప, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.IMG-20261007-WA0007

Tags:

Post Your Comments

Comments

Latest News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన రడపాక దానియేల్.
విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రడపాక దానియేల్ స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్...
వీబీజీ రాంజీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం.
దోమలపై కౌన్సిలర్ వార్.. 9వ వార్డులో ఫాగింగ్!
రైతులకు కరెంటు కట్‌.. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ ఫైర్‌.
గ్రామశాఖలకు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల నియామకం.
టీఎంయూ హుజూరాబాద్ డిపో గౌరవాధ్యక్షుడిగా పుల్లారి ప్రభాకర్‌రావు.