అక్రమ ఇసుక తరలింపుపై కఠిన చర్యలు.

పెద్దమందడి తహసిల్దార్ మల్లికార్జున్, ఎస్సై జలంధర్ రెడ్డి.

అక్రమ ఇసుక తరలింపుపై కఠిన చర్యలు.

పెద్దమందడి,అక్టోబరు06(తెలంగాణ ముచ్చట్లు):

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దమందడి తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి హెచ్చరించారు. పెద్దమందడి మండల పరిధిలోని మద్దిగట్ల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను అధికారులు సోమవారం సీజ్‌ చేశారు.వెల్టూర్ చెరువు శివారుల నుంచి మద్దిగట్ల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుకను తరలించి డంపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను పరిశీలించి సీజ్‌ చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం, నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన. ఘన్‌పూర్‌లో విద్యుత్ పరికరాల మరమ్మతు కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన.
వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుదల.. పొదుపు పాటించాలి జిల్లా సమన్వయ అధికారి పి.శ్రీకాంత్ స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 6(తెలంగాణ ముచ్చట్లు):  విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోందని, వినియోగదారులు...
బుగులు వెంకన్నకు అష్టదళ పాద పద్మారాధన.
మాజీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన పార్టీ శ్రేణులు.
వాడివేడిగా మున్సిపల్ అత్యవసర సమావేశం.
పట్టభద్రుల ఓటర్లను కదిలించాలి.
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం ఫైర్.
ప్రకృతి సేద్యమే మేలు!