లబ్ధిదారులకు అండగా సీఎం సహాయనిధి.

లబ్ధిదారులకు అండగా సీఎం సహాయనిధి.

*పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా – ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ*

మానకొండూర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో గల రైతు వేదిక భవనంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ మండలానికి చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం ద్వారా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.