దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మళ్లీ వాయిదా పడ్డ చిల్పూర్ గుట్ట హుండీ లెక్కింపు
తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామన్న ఈవో లక్ష్మీప్రసన్న
చిల్పూర్, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిల్పూర్ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం జరగాల్సిన హుండీ లెక్కింపు మరోసారి వాయిదా పడింది.తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో దేవాలయ భూముల లీజులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ మీటింగ్‌లు నిర్వహిస్తున్న నేపథ్యంలో, సహాయ కమిషనర్ నల్లగొండ ఆదేశాల మేరకు సోమవారం జరగాల్సిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి భాగం లక్ష్మీప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.
దేవాదాయ శాఖ అధికారుల సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. హుండీ లెక్కింపు తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈవో లక్ష్మీప్రసన్న వెల్లడించారు.కాగా, హుండీ లెక్కింపు వాయిదా పడటంతో భక్తుల్లో మరోసారి ఆసక్తి నెలకొంది. తదుపరి తేదీపై దేవస్థానం నుంచి అధికారిక ప్రకటన కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.


Comments