మామిడి తోటలో అడవి దున్న సంచారం.
రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Views: 3
On
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి జంతువు సంచరిస్తుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళనకు గురవుతున్నారు.
పొలాలు, తోటలకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఎవరూ ఒంటరిగా తోటల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అడవి దున్న సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్థులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Oct 2026 21:08:27
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...


Comments