మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.
విద్యాభివృద్ధిలో పెద్దమందడిని ప్రథమ స్థానంలో నిలుపుదాం.
పెద్దమందడి,అక్టోబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శాంతన్నను పెద్దమందడి మండల పీఆర్టీయూ టీఎస్ శాఖ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ మండలాన్ని విద్యాభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సంఘం తరఫున నూతన విద్యాధికారికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. మండలంలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.మండల విద్యాధికారి శాంతన్న మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి పెద్దమందడి మండలాన్ని విద్యాభివృద్ధిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలపాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ సంఘం అధ్యక్షులు శివారెడ్డి, మండల ఉపాధ్యక్షులు తిరుమలేశ్వరాచారి, కార్యదర్శి సూరసంజీవ్, సంఘం నాయకులు బండి శ్రీనివాస్, ఉపాధ్యాయులు సాయి చరణ్‌రెడ్డి, మల్లికార్జున్, నరేష్, రాజశేఖర్, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.


Comments