ప్రభుత్వ భూమి కబ్జా..! వీఓ బిల్డింగ్‌కు స్థలం ఏదీ?

ప్రభుత్వ భూమి కబ్జా..! వీఓ బిల్డింగ్‌కు స్థలం ఏదీ?

* అధికారుల తీరుపై మహిళా సంఘాల ఆగ్రహం

* ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

జమ్మికుంట, అక్టోబర్‌ 5 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెద్దంపల్లి గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని, మహిళా సంఘాల వీఓ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
వీఓ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కలెక్టరేట్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ కబ్జాను తొలగించి మహిళా సంఘాలకు ఉపయోగపడేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఎక్కడుందని నిలదీశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కార్యాలయాల చుట్టూ తిప్పడం తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ప్రభుత్వ భూమిని తక్షణమే సర్వే చేసి, కబ్జాను తొలగించి, వీఓ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మహిళా సంఘాల IMG-20261005-WA0038సభ్యులు హెచ్చరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.