ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా విజయదేవి.
శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు.
కరీంనగర్, అక్టోబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నూతనంగా నియమితులైన గుగులోతు విజయదేవిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ఎస్టీ మోర్చా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు విజయదేవి సంతోషం వ్యక్తం చేశారు. తనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన యాదగిరి సునీల్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Comments