ఇంద్రానగర్‌లో కమలం వైపు యువత అడుగులు.

వార్డు మెంబర్‌తో పాటు పలువురు యువకులు బీజేపీలో చేరిక.

ఇంద్రానగర్‌లో కమలం వైపు యువత అడుగులు.

ఎల్కతుర్తి, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలంలోని ఇంద్రానగర్ గ్రామంలో బీజేపీలోకి యువత చేరికలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న కేంద్ర నిధులపై నమ్మకంతో వార్డు మెంబర్‌తో పాటు పలువురు యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఇంద్రానగర్ మాజీ సర్పంచ్ కడారి ప్రసాద్, నమిండ్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న నిధులు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు, సంక్షేమం, అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు. యువత ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తాజా చేరికలతో ఇంద్రానగర్‌లో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
బీజేపీలో సందేలా మధు, సందేలా చందు, గొర్రె చరణ్, కడారి అఖిల్, వూట్కూరి రాకేష్, కోడూరి అభి సాకేత్, సుర వినయ్, నక్క రాకేష్, ముడుతనపల్లి కిరణ్, కోడూరి హర్ష వర్ధన్ తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల ప్రధాన కార్యదర్శి చీదురాల వెంకటేష్, సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముషీకే వెంకటేష్, జనగాని కిష్టయ్య, ఆడెపు శ్రీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మామిడి తోటలో అడవి దున్న సంచారం. మామిడి తోటలో అడవి దున్న సంచారం.
వేంసూరు, అక్టోబరు 5(తెలంగాణ ముచ్చట్లు): వేంసూరు మండలం చౌడవరం గ్రామ సమీపంలోని మామిడి తోటలో అడవి దున్న సంచరిస్తూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. తోటలో అడవి...
భూములిచ్చేది లేదు.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వద్దు!
ప్రజావాణిపై.. ప్రజల్లో సన్నగిల్లిన ఆశలు!
డిగ్రీ ఉంటే చాలదు.. స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తు!
రెండేళ్లుగా కన్నీళ్లే.. ఇప్పటికీ పింఛను కరువే!
దేవాదాయ శాఖ స్పెషల్ డ్రైవ్ మీటింగ్ కారణంగా..
మండల విద్యాధికారికి పీఆర్టీయూ టీఎస్ ఘన సన్మానం.