మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు.

మీటర్ చార్జీల పెంపు, సంక్షేమ బోర్డుపై ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు.

-- తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు

వనపర్తి,అక్టోబర్04(తెలంగాణ ముచ్చట్లు): 

ఆటో మీటర్ చార్జీల పెంపుతో పాటు త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వానికి తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసు కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ ప్రజాభవన్‌లో శనివారం రాత్రి ఆటో డ్రైవర్లతో నిర్వహించిన డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్న దయ్యాల దాసు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మీటర్ చార్జీల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.అలాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా కృషి చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ యూనియన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని దయ్యాల దాసు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News