పండుగ ముందే రోడ్డు క్లియర్.
వేలాడుతున్న చెట్ల కొమ్మలు, ముళ్లపొదల తొలగింపు
జేసీబీతో పనులు చేపట్టిన కౌన్సిలర్ రమ్య రఘురెడ్డి
స్టేషన్ ఘనపూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
బతుకమ్మ పండుగ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ 5వ వార్డులో రహదారి రూపురేఖలు మారిపోయాయి. ఏళ్లుగా రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలు, వేలాడుతున్న చెట్ల కొమ్మలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య రఘురెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం జేసీబీ సహాయంతో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, రహదారికి అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి రహదారిని శుభ్రం చేయించారు.
బతుకమ్మ పండుగకు వచ్చే ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు కౌన్సిలర్ రమ్య రఘురెడ్డి తెలిపారు. రహదారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.


Comments