ఇంటిపై సోలార్‌తో.. కరెంట్ బిల్లుకు బైబై.

3 కిలోవాట్లకు రూ.78 వేల సబ్సిడీ.. 7 శాతం వడ్డీకే బ్యాంకు రుణం.

ఇంటిపై సోలార్‌తో.. కరెంట్ బిల్లుకు బైబై.

ఘనపూర్‌,అక్టోబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకంతో విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని ఎన్పీడీసీఎల్‌ స్టేషన్‌ ఘనపూర్‌ విద్యుత్‌ డీఈ బి.సారయ్య అన్నారు. స్టేషన్‌ ఘనపూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన సేవా-సేతు అవగాహన కార్యక్రమం శనివారం ముగిసింది.ఈ సందర్భంగా డీఈ సారయ్య మాట్లాడుతూ.. రూ.1.45 లక్షల విలువైన 3 కిలోవాట్ల సోలార్‌ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. మిగిలిన మొత్తానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌ పథకానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

నెలకు సుమారు రూ.3 వేల విద్యుత్‌ బిల్లు చెల్లించే వినియోగదారులకు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు ద్వారా సుమారు మూడేళ్లలో పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని సారయ్య వివరించారు. మూడు రోజుల అవగాహన కార్యక్రమం ద్వారా సుమారు 200 మంది వినియోగదారులకు సోలార్‌ విద్యుత్‌ ప్రయోజనాలు, పథకం వివరాలపై అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడీఈ పి.రణధీర్‌రెడ్డి, బి.శ్రీధర్‌, ఏఏఓ యాకూబ్‌ పాషా, ఏఈలు శంకర్‌, శ్వేత, సురేష్‌, శివకుమార్‌, రవీందర్‌, రాకేష్‌, కరుణాకర్‌, సబ్‌ ఇంజనీర్లు మన్విత, హరిత, సాధన, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలం ఐలేష్‌, టీఆర్‌కేవీఎస్‌ జిల్లా నాయకులు అల్వాల మహేందర్‌రెడ్డి, జేఏవో నాగేందర్‌, ఎల్‌ఐ యాదగిరి, లైన్‌మెన్లు శ్రీధర్‌, సందీప్‌, అన్వర్‌ పాషా, అశోక్‌, విద్యుత్‌ ఉద్యోగులు, పాలకుర్తి, ఘనపూర్‌ వినియోగదారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.