ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం.
వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):
ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందిన సంబు స్వప్నిల్‌ను సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. శనివారం వనపర్తిలోని ఆయన స్వగృహంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, భవిష్యత్‌లో స్వప్నిల్ పేదలకు సేవలందించాలని ఆకాంక్షించారు.స్వప్నిల్ తల్లిదండ్రులు భారతి, శ్రీనివాసులు కూడా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. అనంతరం కళా వేదిక ప్రతినిధులు స్వప్నిల్‌ను శాలువా, పూలమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు కందూరు నారాయణరెడ్డి, బైరోజు చంద్రశేఖర్, డా. బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, డా. బి. శ్యాంసుందర్, పెరుమాళ్ల శ్రీనివాస్, వడ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments