సింగోటం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి కుటుంబం.
వనపర్తి,అక్టోబర్03(తెలంగాణ ముచ్చట్లు):
శనివారం కృష్ణపక్ష అష్టమి, ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా సింగోటంలోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి సతీమణి శారదారెడ్డి, కుమారుడు నవనీత్‌రెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద బ్రాహ్మణులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు.అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలోనూ ప్రత్యేక అర్చనలు జరిపారు. వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.స్వామివారి కృపతో వనపర్తి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు.


Comments