సోదరి జ్ఞాపకార్థం స్పోర్ట్స్ కిట్ల పంపిణీ.
మానవత్వం చాటిన టీచర్ నీలిమ.
చిల్పూర్,అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
మృతి చెందిన చెల్లెలి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేపట్టి ఓ ఉపాధ్యాయురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు నీలిమ తన చెల్లెలు కీ.శే. శారా సునందిని (ఏఈఈ, ఎన్‌పీడీసీఎల్) జ్ఞాపకార్థం పాఠశాలలో నూతనంగా చేరిన 62 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువైన స్పోర్ట్స్ యూనిఫామ్‌లను అందజేశారు. అలాగే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హెచ్‌ఎం ఎల్లంభట్ల విజయకుమార్, చిల్పూర్ గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్, సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, నాయకులు చిర్రా నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సహాయం చేయడం అభినందనీయమని, సోదరి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయురాలు నీలిమను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోమలి, శ్యాంసుందర్‌రావు, అరుణాదేవి, లక్ష్మి, రమేష్, సురేష్, యాకుబ్ పాషా, దేవ్ సింగ్ రాథోడ్, శ్రీకాంత్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments