మా భూములు ముట్టుకుంటే ఊరుకోం!

మా భూములు ముట్టుకుంటే ఊరుకోం!

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూసేకరణపై భగ్గుమన్న రైతులు

అధికారులకు వినతిపత్రం

చిల్పూర్‌,అక్టోబర్‌ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు తమ భూములను సేకరించవద్దని నష్కల్‌, వంగలపల్లి గ్రామాల రైతులు స్పష్టం చేశారు. భూసేకరణ ప్రతిపాదనపై శనివారం నష్కల్‌ గ్రామపంచాయతీకి వచ్చిన ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీప్రియ, ఆర్‌ఐ లోకేష్‌లను రైతులు నిలదీశారు.
తమ తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములే తమ జీవనాధారమని రైతులు తెలిపారు. తాము చిన్న, సన్నకారు రైతులమని, భూములు కోల్పోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. “మా భూములే మాకు జీవనాధారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదు” అంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

బీజేపీ మండల అధ్యక్షుడు గంటే ఉపేందర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి శాగంటి మణి ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం భూసేకరణ ప్రతిపాదనపై పునరాలోచించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్లు ఉపేందర్‌, సత్యనారాయణ, చిల్పూర్‌ ఆర్‌ఐ లోకేష్‌, నష్కల్‌ జీపీఓ యాకయ్య, రైతులకు సంఘీభావంగా గంటే లక్ష్మి, చిట్యాల రాజేష్‌ కన్నా, శాగంటి అనిల్‌, పాశం దాస్‌, బిక్షపతి, కరుణాకర్‌, శాగంటి యోబు, పాశం వినోద్‌, శాగంటి బాIMG-20261003-WA0057బు తదితరులు పాల్గొన్నారు. నష్కల్‌, వంగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి. మాజీ సర్పంచ్ సురవరం వేమారెడ్డి మృతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):  ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సురవరం వేమారెడ్డి (82) శనివారం హనుమకొండలో చికిత్స పొందుతూ...
మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
పండుగ ముందే రోడ్డు క్లియర్.
రెడ్డి జాగృతి మండల అధ్యక్షురాలిగా మంతెన సునీతారెడ్డి.
చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
కార్మికుల సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలి.